అగ్నిప్రమాదాలు జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అగ్నిమాపకశాఖాధికారులు విజయవాడలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. నాగార్జున ఆసుపత్రిలోని సిబ్బందికి అగ్నిప్రమాద నివారణలపై సూచనిచ్చాలిచ్చారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరుగుతాయని ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ లీకేజీ కాకుండా జాగ్రత్తపడాలన్నారు. హఠాత్తుగా ఆసుపత్రుల్లో ప్రమాదం సంభవిస్తే రోగులను ఏవిధంగా రక్షించాలో అధికారులు ఆసుపత్రి సిబ్బందికి వివరించారు.
ఇవీ చదవండి