ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

ఏపీ ప్రధాన వార్తలు

AP Top News
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 23, 2022, 5:00 PM IST

  • కాగ్​కు లెక్కలు ఎందుకు చెప్పటం లేదు: యనమల రామకృష్ణుడు
    Yanamala Rama Krishnudu : ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అప్పులపై అనుసరిస్తున్న విధానంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తెచ్చిన అప్పులు స్వార్థానికి వినియోగిస్తున్నారు తప్ప.. అభివృద్ధికి వినియోగించటం లేదని విమర్శించారు. కాగ్​కు లెక్కలు తెలపకపోవటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొత్తపల్లిలో అంతుచిక్కని సమస్య.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
    Seven girls ill at school: ఆ పాఠశాలలో ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన బాలికలను పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం కేవలం ఒకరికే ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న నలుగురు బాలికలను.. రెండు అంబులెన్సుల్లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధిచిన అంశాన్ని గోప్యంగా ఉంచిన టీచర్లపై చర్యలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి.. నదిలో శవం.. అసలేమైంది..!
    YOUNG WOMAN DIED IN KADAPA : బద్వేలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బద్వేల్ పోలీసులు అనూష మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొవిడ్ పరిహారం పేరుతో మోసం.. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా
    International gang frauds: కొవిడ్ మృతులకు పరిహారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు దిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్​లో వాట్సాప్​లో వచ్చే లింక్​ల​ను చూసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరోసారి సీఐడీ విచారణకు రావిపాటి సాయికృష్ణ
    Ravipati Sai Krishna: గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సీఐడీ అధికారులు విచారించగా.. మళ్లీ హాజరుకావాలని నోటీసులు ఇవ్వటంతో ఆయన సీఐడీ ఎదుట మరోసారి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండు ట్రాలీల బరువు ఒకేసారి.. యువ డ్రైవర్​ జుగాడ్​తో డీజిల్ ఆదా
    సాధారణంగా ట్రాలీని ట్రాక్టర్​తో అనుసంధానిస్తే సుమారు 25 టన్నుల బరువును మోస్తుంది. కానీ.. 40 టన్నుల బరువు మోయగలిగేలా గూడ్స్​ ట్రక్ రూపొందించాడు మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన అక్షయ్ చవాన్ అనే యువకుడు​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహిళను చెంప దెబ్బ కొట్టిన మంత్రి.. భూమి గురించి అడిగినందుకు..
    భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను కర్ణాటకలోని ఓ మంత్రి చెంప దెబ్బ కొట్టారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup : పాక్​ బ్యాటర్లకు చుక్కలు.. భారత్ లక్ష్యం 160
    T20 World Cup : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్​ మ్యాచ్​లో టీమ్ ఇండియా చెలరేగిపోయింది. టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న భారత వీరులు.. అద్భుతంగా ప్రదర్శన చేశారు. ఇక పాక్​ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభాస్​ బర్త్​డే స్పెషల్​.. మూవీ టీమ్స్​ నుంచి రెండు సర్‌ప్రైజ్‌​లు
    ప్రభాస్​ బర్త్​డే సందర్భంగా తన అప్​కమింగ్​ మూవీ అప్డేట్స్​ విడుదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ అప్డేట్స్​ మీ కోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విమానం క్రాష్​లో గోల్డ్స్​ జిమ్​ యజమాని దుర్మరణం
    అమెరికా కోస్టారికా ప్రాంతాంలోని కరేబియన్​ సముద్రంలో ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గోల్డ్స్​ జిమ్ ఓనర్​​, మెక్​ఫిట్​ వ్యవస్థాపకులు రైనర్​ షాలర్​ కూడా మృతుల్లో ఒకరు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.