సాంకేతిక వినియోగంలో జాతీయస్థాయిలో రాష్ట్ర పోలీసు శాఖ సత్తా చాటింది. స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 84 అవార్డుల్లో 48 అవార్డులను ఏపీ పోలీసులు దక్కించుకున్నారు. సాంకేతిక వినియోగంలో వరుసగా రెండోసారి రాష్ట్ర పోలీసులు అవార్డులను కైవసం చేసుకున్నారు.
ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకోగా, తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులను సొంతం చేసుకున్నారు. మొత్తం 85 అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ పోలీసు శాఖ నిలిచింది. అవార్డులు దక్కించుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు.
ఇదీ చదవండి