అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన పూర్తి, వాటి పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఏపీ పోలీసులకు పురస్కారాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన సిబ్బందిని సీఎం జగన్ అభినందించారని తెలిపారు.
ఇదీ చదవండి