కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించేందుకు ఏపీ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. విజయవాడ అజిత్సింగ్ నగర్ ప్రధాన కూడలిలో కరోనా వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించే పెయింట్ వేశారు. పెయింటింగ్ అసోసియేషన్ సభ్యులు, మూడవ పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజు సిబ్బంది నేతృత్వంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు సరైన అవగాన లేక రాకపోకలు సాగిస్తున్న తరుణంలో వారిలో చైతన్యం తెచ్చేందుకే ఈ పెయింటింగ్ వేయించినట్లు మూడవ పట్టణ సీఐ బాలరాజు వివరించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టుల సహకారంతో ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చుననే సందేశం పెయింటింగ్ రూపంలో చక్కగా వివరించారన్నారు.
ఇదీ చదవండి: నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన