పీఆర్సీ నివేదిక అధ్యయనానికి కమిటీ వేయడంపై ఉద్యోగ సంఘాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ అమలును కాలయాపన చేయడానికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నివేదిక సమర్పించడానికి కూడా ఉన్నతస్థాయి కమిటీకి కాలపరిమితి విధించకపోవడం సరికాదని అమరావతి జేఏసీ వ్యాఖ్యానించింది. తెలంగాణలో ఇప్పటికే పీఈర్సీని అమలు చేస్తున్నారని... ఎలాంటి సెక్రెటరీల నివేదిక లేకుండానే పీఆర్సీని ప్రకటించారని ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. గత పీఆర్సీని ఎలాంటి సెక్రెటరీల నివేదిక లేకుండానే ప్రభుత్వం గతంలో ఆమోదించిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.
పీఆర్సీ నివేదిక అమలును మరింత జాప్యం చేయడానికే కమిటీ ఏర్పాటు చేసినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీరు ఉద్యోగులకు నిరాశ కలిగించింది.. తీవ్ర నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేశాయి.కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్నట్టు ఉద్యోగుల సంఘాలు అంటున్నాయి. వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా పే స్కేల్ ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి. హైదరాబాద్‌లోని గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు