ETV Bharat / state

శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. రెండు రోజులే..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ దృష్ట్యా 2 రోజులు మాత్రమే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే గవర్నర్ ప్రసంగించనున్నారు. మరోవైపు 2020-21 బడ్జెట్​ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించనుంది.

ap assembly session 2020
ap assembly session 2020
author img

By

Published : Jun 15, 2020, 8:24 PM IST

Updated : Jun 16, 2020, 1:52 AM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను సాధ్యమైనంత మేర కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి సమావేశాల తొలిరోజే బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి.. సచివాలయంలో సీఎం జగన్​ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్​కు ఆమోదముద్ర వేయనుంది.

సమావేశాలు జరిగేదిలా..

  • ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం.
  • గవర్నర్​ ప్రసంగం ఉభయ సభల్లోనూ తెరలపై సభ్యుల వీక్షణ. అనంతరం ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదం. తర్వాత బీఏసీ సమావేశం.
  • మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్​ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్​ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు.
  • మండలిలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​ బడ్జెట్​ ప్రవేశపెడతారు. ఇక్కడ వ్యవసాయ బడ్జెట్​ను పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
  • మధ్యాహ్నం 2.45 గంటలలోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం.
  • బడ్జెట్​పై ఉభయ సభల్లోనూ బుధవారం చర్చిస్తారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అదేరోజు ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం

ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... వీడియో కాల్ ద్వారా ప్రసంగించనున్నారు. కోవిడ్ దృష్ట్యా ఉభయ సభ సభ్యులూ వేర్వేరుగానే ఆయా సభల్లో ప్రసంగానికి హాజరు కానున్నారు. ఈ మేరకు శాసనసభ, మండలిలో వేర్వేరుగా గోడ తెరలను ఏర్పాటు చేశారు.

పరీక్షల ఆధారంగా జాగ్రత్తలు

శాసనసభ, మండలిలోకి సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. సభ్యులు వారి జిల్లాల్లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అలా చేయించుకోలేకపోయిన వారికి శాసనసభ ఆవరణలో ట్రూనాట్​ పరీక్షలు చేయాలని యంత్రాంగానికి నిర్దేశించారు.

మంత్రుల సిబ్బందికే అనుమతి

కరోనా దృష్ట్యా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెంట సిబ్బంది, అనుచరులు శాసనసభలోకి వచ్చేందుకు వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. మంత్రులకు మాత్రం ఇద్దరు సిబ్బందిని అనుమతించాలని నిర్ణయించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

శాసనసభ నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే ఉభయ సభలనూ పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే ఎమ్మెల్యేలకు పీపీఈ కిట్లను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభకు వచ్చే ప్రతి సభ్యుడికీ స్వాబ్ టెస్టు చేయాలని నిర్ణయించారు. ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చిన ఓ శాసనసభ్యుడి క్వారంటైన్ పూర్తి కాకపోవటంతో ఆయన హాజరుపై సందిగ్ధత నెలకొంది. శాసనసభ నిబంధనల దృష్ట్యా ఏ సభ్యుడి హాజరునూ నిరోధించే పరిస్థితి లేనందున అన్నింటికీ ఏర్పాట్లు చేసినట్టు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

సభలో సమరం: నల్ల చొక్కాలతో హాజరవ్వాలని తెదేపా నిర్ణయం

Last Updated : Jun 16, 2020, 1:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.