మాజీమంత్రి దేవినేని వెంకటరమణ ప్రణీతల ఎత్తిపోతల పథకం, చింతలపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు అనుమోలు పద్దయ్య దశదిన కార్యక్రమంలో.. తెదేపా నాయకులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య చేతులమీదుగా.. కృష్ణాజిల్లా నందిగామలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పద్దయ్య లేని లోటు పార్టీకి తీవ్ర నష్టం అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్టీ కాలనీలో పేద ప్రజల కోసం తన సొంత నిధులతో ఆయన ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తు చేసుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: కేంద్ర విధానాలే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి: సీపీఎం