ETV Bharat / state

'అనిగండ్లపాడులో డ్వాక్రా మహిళల ఆవేదన'

గ్రామ స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే కొందరు మహిళలు అవినీతికి పాల్పడుతున్నారంటూ.... అనిగండ్లపాడు డ్వాక్రా మహిళలు స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సమయంలో రుణ మొత్తంలో ఒక శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Sep 30, 2019, 11:59 PM IST

అనిగండ్లపాడులో డ్వాక్రా మహిళల ఆవేదన
అనిగండ్లపాడులో డ్వాక్రా మహిళల ఆవేదన
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు డ్వాక్రా మహిళలు స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే బుక్ పేపర్లు(పత్రాలు నింపేవారు) అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సమయంలో రుణ మొత్తంలో ఒక శాతం వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తింపుకోసం సంఘ సభ్యులు ఒక్కొక్కరి వద్ద 250 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ... సభ్యులందరినీ సమావేశపరిచి వాస్తవాలు తెలుసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: సీఎం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు

Intro:JK_AP_NLR_04_28_PADDY_RATES_DOWEN_RAJA_PKG_BYTS_AP10134

Body:2

Conclusion:3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.