Anganwadi Workers Strike in 28th Day in AP: ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలను అంగన్వాడీలు భేఖాతరు చేశారు. ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించినా లెక్క చేయలేదు. 28వ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. కనీస వేతన పెంపు సహా డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే రానున్న ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
Congress Leaders Support Anganwadi Strike: అంగన్వాడీలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. ప్రభుత్వ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీలు గుంజీలు తీసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేత బూరగడ్డ వేదవ్యాస్ మద్దతు తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ప్రభుత్వం తక్షణమే ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట మానవహారం నిర్వహించారు. అనంతరం ఎస్మా జీవో పత్రాలను తగులబెట్టారు.
12వ రోజూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె - సంఘీభావం తెలిపిన అంగన్వాడీలు, కార్మికులు
Anganwadis Strike in Kurnool: ప్రభుత్వం ఎస్మా పేరిట భయపెట్టినా భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. కర్నూలులో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద దీక్షా శిబిరంలో అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో చేతులకు బేడీలు వేసుకున్నట్లు వస్త్రాలతో కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే సీఎం జగన్ ఉద్యోగం ఊడగొడతామని హెచ్చరించారు. విశాఖ జీవీఎంసీ వద్ద అంగన్వాడీలు ఆందోళన కొనసాగించారు.
సమ్మెను ఉద్ధృతం చేస్తున్న అంగన్వాడీలు - అడ్డుకుంటున్న పోలీసులు
Anganwadis Strike in Ongole Collectorate: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు 28వ రోజు సమ్మె కొనసాగించారు. విధులు బహిష్కరించిన అంగన్వాడీ సిబ్బంది ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిందని, అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్మా నీ వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఈ ఉద్ధృతంగా కొనసాగుతుందని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.
బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
Anganwadis Strike in Vijayawada: రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ తీసుకున్న నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా అంగన్వాడీలు పోరాడుతున్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో నాలుగో రోజు 24గంటల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. కనీస వేతనాలు, గ్రాడ్యూటీ సౌకర్యం కల్పించి, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు.
'ఎస్మా చట్టాలకు భయపడం' - సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గెదే లేదు: అంగన్వాడీలు
Anganwadis Strike in Ananthapuram: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు ఐసీడీఎస్ అంగన్వాడీలు గత 28 రోజులుగా చేస్తున్న సమ్మె సోమవారం కొనసాగింది. ప్రభుత్వం కనీసం మహిళలు అని చూడకుండా ఆందోళన చేపట్టి నెల రోజులు కావస్తున్న తమను పట్టించుకోవడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
స్పందించిన సజ్జల: అంగన్వాడీల సమ్మె వెనక రాజకీయ కోణం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయా గ్రూపుల్లో అంగన్వాడీ సంఘ నేతల ఆడియో సందేశాల బట్టి బహిర్గతమైందన్నారు. ప్రభుత్వం వల్ల అయిన డిమాండ్లన్నీ పరిష్కరించామని, ఆందోళనలు విరమించాలని కోరారు. తప్పని సరిసరి పరిస్థితుల్లోనే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని అన్నారు.