ETV Bharat / state

'అంగన్వాడి సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు' - icds

కంకిపాడు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందిని ఓ గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లకు కాల్ చేస్తూ అసభ్య పదజాలం వాడుతూ తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'అంగన్వాడీ సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు'
author img

By

Published : May 30, 2019, 10:05 PM IST

'అంగన్వాడి సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు'

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందిని ఓ సైకో వేధింపులకు గురి చేస్తున్నాడు. నియోజకవర్గ ఐసీడీఎస్ పరిధిలో సుమారు 20మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారు వినియోగిస్తున్న ప్రభుత్వ చరవాణికి ఓ వ్యక్తి ఫోన్ చేసి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కంకిపాడు ఐసీడీఎస్ అధికారిణికి ఫిర్యాదు చేయగా... వారు పోలీసులతో రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు సమాచారం.

కేవలం అంగన్వాడీ సిబ్బందితోనే ఇలా ప్రవర్తిస్తున్నాడా లేక వేరే వారిని సైతం వేధిస్తున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన చరవాణికి ఏ ఫోన్ వచ్చినా... అది వేధింపులకు గురి చేసే వ్యక్తిది అయి ఉంటుందేమో అని సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

Intro:ap_cdp_16_30_bjp_leaders_sambaralu_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం భారత దేశానికి గర్వకారణమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కడపలోని భాజపా కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యధిక మెజార్టీతో భాజపా తిరిగి అధికారంలోకి రావడం చాలా సంతోషమన్నారు. భారత దేశ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని వారు పేర్కొన్నారు. గతంలో ఇందిరా గాంధీ తర్వాత అంతటి మెజార్టీ రావడం నరేంద్ర మోడీ ఒక్కరేనని చెప్పారు. దేశ ప్రజలందరూ తిరిగి నరేంద్ర మోడీ పాలన కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. భారతదేశంలో మోదీ పాలనకు తిరుగు ఉండదని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని వారు చెప్పారు.

Body:భాజపా సంబరాలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.