ETV Bharat / state

'రాష్ట్ర విభజన తర్వాత ఆర్యవైశ్యులు చాలా ఇబ్బందులు పడ్డారు' - ఏపీ ఆర్యవైశ్య మహాసభ భవనం అప్​డేట్

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వెల్లంపల్లి.. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కలిపిస్తోందన్నారు.

andhrapardesh aarya vyasaya mahasabha
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ
author img

By

Published : Feb 18, 2021, 11:32 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండను.. వాసవి పెనుగొండగా మార్చేందుకు.. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ భవనాన్ని ఎంపీ టీజీ వెంకటేష్‌, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అన్నా రాంబాబు, మద్దాలి గిరిధర్‌, మల్లాది విష్ణులతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఆర్యవైశ్యులకు గతంలోని ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం వీరికి సముచిత స్థానం కలిపిస్తోందని మంత్రి వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యులందరికీ అందుబాటులో ఉంటూ.. సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రులైన రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌ వంటి ప్రముఖులు ఆర్యవైశ్య హాస్టళ్లలో చదువుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్యవైశ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. భవన నిర్మాణం కోసం ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశామని- ఇందుకు సహకరించిన దాతలకు ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: 'సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ... అంతా సహకరించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.