మూగజీవాలు లాక్‌డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. జంతుప్రేమికుడైన కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన నందకిషోర్ గత నెల రోజులుగా ఉదయాన్నే ఆరు గంటలకు తన ఇంట్లోనే ఆహారాన్ని వండి.... ద్విచక్రవాహనంపై మూగజీవాల ఉన్నచోటకు వెళ్లి అందిస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో బయట తిరిగే జీవాలకు తన వంతు సాయం అందించినందుకు సంతోషంగా ఉందని నందకిషోర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: సడలింపు దిశగా ప్రపంచం.. అమెరికాలో రాజకీయ వేడి!