చక్కటి సదుపాయాలతో వృద్దులకు ఆశ్రయం కల్పిస్తున్న అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్ధకు చేయూత అందిస్తామని కథానాయకుడు నవదీప్ ప్రకటించారు. కృష్ణా జిల్లా విజయవాడ వాంబే కాలనీలోని ఈ సేవా సంస్థ పదో వార్షికోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాలం ద్వారా హీరో నవదీప్ సందేశం పంపారు. కరోనా కారణంగా తాను రాలేకపోతున్నానని త్వరలో ఆశ్రమానికి వచ్చి వృద్ధ దంపతుల ఆశీర్వచనం తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమానికి సింగ్ నగర్, పాయకాపురం పోలీస్ స్టేషన్ల సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు... వృద్ధులు, వికలాంగులకు చీరలు పంపిణీ చేశారు. ఆశ్రమంలో మంచానికే పరిమితమైన రవికుమార్ అనే వికలాంగునికి రూ.9 వేలు అందించారు. అదేవిధంగా అజిత్ సింగ్ నగర్‌కు చెందిన శకుంతల అనే మహిళలకు వైద్యం కోసం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ తరఫున సోమరాజు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది రాము, ఆశ్రమ నిర్వాహకులు నాగేంద్ర, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: