బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో విజయవాడలో అమరావతి ఫుడ్స్ అండ్ సూపర్ మార్ట్ పేరుతో మొబైల్ మార్ట్‌ను ప్రారంభించారు. నగరంలో కరోనా బాధితులు నివాసముంటున్న ప్రాంతాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడంతో అక్కడ నివాసముంటున్న వారిని బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలు నిత్యావసర సరకులు, ఇతర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నందున ఈ సంచార దుకాణాలను ఏర్పాటు చేశామని ఆ సంస్ధ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి.