చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. వారిలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాటవాలను ప్రదర్శనకు పిల్లల పండుగ సిద్ధమైంది. అమరావతి బాలోత్సవం 2019 పేరిట డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో పిల్లల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవానికి సంబంధించిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల వేదికగా మూడు రోజుల పాటు బాలోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పిల్లల పండుగకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బాలోత్సవం కమిటీ సభ్యులు పిలుపునిచ్చింది. కార్యక్రమంలో భాగంగా బాలోత్సవం 2019 బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి బాలోత్సవం కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు, విద్యా, సాంస్కృతిక రంగ నిపుణులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: అబ్బురపరిచిన అమరావతి బాలోత్సవం-2019