యురేనియం తవ్వకాలు ఆపాలి.. ప్రజారోగ్యం కాపాడాలంటూ, విజయవాడలో అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) నినదించింది. దాసరి భవన్ లో చర్చావేదిక నిర్వహించిన సమాఖ్య..తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చేపట్టవద్దని డిమాండ్ చేసింది. యురేనియం తవ్వకాలతో తాగు,సాగు నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ప్రోగ్రెసివ్ ఫోరమ్ కేంద్ర కార్యవర్గ సభ్యులు బుడ్డిగ జమిందార్ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియంకి బదులుగా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలనిఆయన సూచించారు.
ఇదీ చదవండి: "నివేదిక వచ్చాక... పోలవరంలో ఎంత మిగిలిందో చెప్తాం"