ETV Bharat / state

సెప్టెంబర్‌ 15 నాటికి తొలి ఏడాది తరగతులు ప్రారంభించాలి: ఏఐసీటీఐ - ఏఐసీటీఈ

ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యా సంవత్సర ప్రణాళికను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15 నాటికి మొదటి సంవత్సర తరగుతులు ప్రారంభించాలని కళాశాలలకు సూచించింది.

సెప్టెంబర్‌ 15 నాటికి తొలి ఏడాది తరగుతులు ప్రారంభించాలి : ఏఐసీటీఐ

author img

By

Published : May 7, 2021, 8:02 AM IST

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించాలని కళాశాలలకు ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సర ప్రణాళిక తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబరు 1 తేదీ కల్లా మిగతా తరగతులు ప్రారంభించాలని కాలేజీలకు తెలిపింది. జూన్ 30లోగా అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. జులై 15 లోగా కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీటీఈ వివరించింది.

సెప్టెంబర్‌ 15 నాటికి తొలి ఏడాది తరగుతులు ప్రారంభించాలి : ఏఐసీటీఐ
సెప్టెంబర్‌ 15 నాటికి తొలి ఏడాది తరగుతులు ప్రారంభించాలి : ఏఐసీటీఐ

కౌన్సిలింగ్ తేదీల ప్రకటన

ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్, సీట్ల భర్తీ ఆగస్టు 31లోగా.. రెండో విడత సెప్టెంబరు 9లోగా పూర్తి చేయాలని తేదీలను నిర్దేశించింది. సీట్ల రద్దు, ఫీజు తిరిగి చెల్లింపు వంటి ప్రక్రియను సెప్టెంబరు 10లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే ప్రక్రియను సెప్టెంబరు 20నాటికి పూర్తి చేయాలని మండలి తెలిపింది.

రెండు విధాలుగా తరగతులకు అనుమతి

కళాశాలల్లో తరగతులను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా రెండూ కలిసి నిర్వహించుకోవడానికి కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. కరోనా పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం విద్యా క్యాలెండర్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశముందని తెలిపింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు మే నెలలో రాత పరీక్షలు నిర్వహించవద్దని యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికంగా పరిస్థితులను బట్టి అవసరమైతే ఆన్ లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చునని అఖిల భారత సాంకేతిక విద్యామండలి.

ఇవీ చూడండి : లోపాలున్నాయ్ సరిదిద్దుకోండి.. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.