కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని వ్యవసాయ పొలాల్లో రైతులతో కలిసి పొలం బాట పట్టారు బాపట్ల ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థినులు. గ్రామీణ వ్యవసాయం, పని అనుభవం, శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థినులు బృందాలుగా వెళ్లారు. నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయిలో వరి, కంద, పసుపు, బొప్పాయి తదితర పంటలను పరిశీలిస్తూ రైతులకు సూచనలు అందించారు. పచ్చ తెగుళ్లు, వాటి నివారణకు రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకుంటున్నారు. పొలం పనులు చేస్తూ అవగాహన పెంచుకుంటున్నారు.
తోట్లవల్లూరులో పొలం బాట పట్టిన వ్యవసాయ విద్యార్థినులు - acharya ng ranga students in thotalavalluru
మహిళలు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారంటే పొరపాటే! అన్నం పెట్టే పొలంలోనూ పంటలు పండిస్తామంటూ అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. వ్యవసాయంపై ఇష్టంతో... పొలం దున్నే కోర్సులపై యువత మక్కువ చూపుతున్నారు. గట్టి పోటీని తట్టుకుని మరీ ఈ తరహా కోర్సుల్లో సీట్లు సాధించి పొలం బాట పట్టారు అమ్మాయిలు.
![తోట్లవల్లూరులో పొలం బాట పట్టిన వ్యవసాయ విద్యార్థినులు agriculture students went to paddy farms at thotlavalluru in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6072064-904-6072064-1581687061177.jpg?imwidth=3840)
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని వ్యవసాయ పొలాల్లో రైతులతో కలిసి పొలం బాట పట్టారు బాపట్ల ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థినులు. గ్రామీణ వ్యవసాయం, పని అనుభవం, శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థినులు బృందాలుగా వెళ్లారు. నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయిలో వరి, కంద, పసుపు, బొప్పాయి తదితర పంటలను పరిశీలిస్తూ రైతులకు సూచనలు అందించారు. పచ్చ తెగుళ్లు, వాటి నివారణకు రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకుంటున్నారు. పొలం పనులు చేస్తూ అవగాహన పెంచుకుంటున్నారు.
ఇదీచూడండి.ఎక్సైజ్‌శాఖ అధికారులతో మంత్రి నారాయణస్వామి సమీక్ష