కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్.. కొడాలి మార్కెట్ యార్డ్ పరిధిలో ఉంది. కానీ ప్రస్తుతం అది కూలిపోయే స్థితిలోకి వచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. షెడ్డుపై ఉన్న తాటాకులు పూర్తిగా పాడయిపోయాయి. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎప్పుడు కూలిపోయి తమమీద పడుతుందోనని బయటే కుర్చీలు వేసుకుని సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ చెక్ పోస్ట్ కు సుమారు రూ. 20 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. వ్యవసాయ ఉత్పత్తులు ఒకచోట నుంచి మరొక చోటకు తరలించే సందర్బంలో స్థానికంగా ఉండే చెక్ పోస్ట్‌ల దగ్గర కొంత టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ఆదాయంతో మార్కెట్ కమిటీలు రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్ పోస్ట్ కు మరమ్మతులు చేయాలని అక్కడి సిబ్బంది కోరుతున్నారు.
ఇవీ చదవండి: