ఈ నెల 22న సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలో మెగాస్టార్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న థియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వారం రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించి జిల్లాలోని పలు థియేటర్లలో పనిచేసే సిబ్బందికి సరకులు అందిస్తామని అభిమాని శ్యాంప్రసాద్ తెలిపారు.
ఇదీచదవండి.