భూసంస్కరణల విభాగ అధీకృత అధికారిని డి.ప్రశాంతి మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ తెలియజేసిన వివరాలమేరకు... తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌కు చెందిన ఎం.రామలింగేశ్వరరెడ్డి ఉయ్యూరు మండలం కాటూరు గ్రామ పరిధిలో 2015లో నాలుగు ఎకరాల 53 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలుచేశారు. ఆ వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ల్యాండ్ రికార్డ్స్‌అధికారిణి రూ. 6లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం కలెక్టరేట్‌లోని ఆమె విభాగంలో రైతు నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందన్నారు.
ఇవీ చదవండి