కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేశారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపించారు. సహకార పరపతి సంఘంలో తాను లోన్ తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించుకుని బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరకలపాడు సహకారం సంఘంలో, గద్దె వీరభద్రరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు.
పెరకలపాడులో అనిశా దాడులు - acb raids in krishna distrct
కృష్ణా జిల్లా పెరకలపాడు సహకార సంఘంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తన పేరుపై బినామీ రుణాలు పొందారని ఓ మహిళ ఫిర్యాదుతో అనిశా రంగంలో దిగింది.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేశారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపించారు. సహకార పరపతి సంఘంలో తాను లోన్ తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించుకుని బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరకలపాడు సహకారం సంఘంలో, గద్దె వీరభద్రరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చూడండి: బాలికలతో వెట్టిచాకిరి చేయిస్తోన్న టీవీ యాంకర్