ETV Bharat / state

కొలువుల జాతర... ఆగస్టులో ఉద్యోగాల పండగ

గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్లతో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఒకేసారి లక్షా 28వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పరీక్ష తేదీలు, సిలబస్ సైతం ఖరారుతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని సన్నద్ధం అవుతున్నారు.

అదిగో సర్కారు కొలువు
author img

By

Published : Jul 30, 2019, 5:32 AM IST

అదిగో సర్కారు కొలువు

ఆగస్టు 26, 29,30, సెప్టెంబర్ 1.... ఆ వారం రోజులు రాష్ట్రంలో పరీక్షల హడావుడి నెలకొనబోతోంది. గ్రూప్-3 ప్రధాన పరీక్షను ఆగస్టు 26న నిర్వహించేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేసింది. 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం 14వేల 175మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. అంతేకాకుండా 447 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం 6వేల 195 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్ష రాయనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2కు సంబంధించిన ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. తర్వాత రెండు రోజులకే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామక పరీక్ష నిర్వహించనున్నారు.

సహజంగా ప్రభుత్వ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన నాటినుంచి పరీక్ష నిర్వహించడానికి కనీసం 45 రోజులు వ్యవధి ఉండడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గాంధీ జయంతి నాటికి...గ్రామ, వార్డు కార్యదర్శులు విధుల్లోకి చేరాలనే ఉద్దేశంతో తక్కువ వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రూప్స్​కు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతోపాటు ఇతర నిరుద్యోగులు సైతం ఈ గ్రామ, వార్డు సచివాలయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

గ్రూప్ 3, గ్రూప్ 2 ప్రధాన పరీక్షలు రాసే అభ్యర్థులు సైతం గ్రామ సచివాలయాల నియామక పరీక్షలు రాస్తున్నందున వారు అర్హత సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 3, గ్రూప్ 2 ప్రధాన పరీక్షల ఫలితాల విడుదల, నియామక ప్రక్రియలో జాప్యం జరిగితే...గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులు.. సచివాలయ ఉద్యోగాల్లో చేరిపోతారు. ఆ తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 2లో ఉద్యోగం వస్తే... సచివాలయ ఉద్యాగాలు వదులుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఆ తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులకు మేలు జరుగుతుంది. మొత్తానికి రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల కోలాహలం మొదలైంది. మంచి తరుణం మించిన దొరకదన్న చందంగా ఒకేసారి లక్షా 28వేలపైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో... సర్కారీ కొలువు దక్కించుకోవాలని అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి తపిస్తున్నాడు.

ఇదీ చూడండి : రహదారులను ఆక్రమిస్తే కఠిన చర్యలు"

Intro:Ap_atp_61_29_agnipramadam_av_ap10005
~~~~~~~~~~~~~~~*
గ్యాస్ సిలిండర్ పేలి టీ దుకాణం దగ్ధం
~~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. స్థానిక కొల్లపురమ్మ ఆలయ సమీపంలో రామలింగ అనే వ్యక్తి ఈ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో తెల్లవారున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆ వేడికి గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మా వదల వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.