కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో... డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతిచెందింది. కోకిలంపాడుకు చెందిన స్వర్ణలత కాన్పు నిమిత్తం వారం రోజుల క్రితం తిరువూరు ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. మంగళవారం శస్త్ర చికిత్స చేయగా... ఆమె బాలుడికి జన్మనిచ్చింది. 3 రోజుల నుంచి స్వర్ణలత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా శ్వాస అందక పరిస్థితి విషమించింది. ఈవిషయం వైద్యులకు తెలిపినా... పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజిదాబీ మాట్లాడుతూ... డెలివరి సమయంలో కొన్ని రుగ్మతల కారణంగా... పరిస్థితి విషమించే అవకాశం ఉందని... వైద్యులు తమవంతు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందన్నారు.
ఇదీ చదవండి: ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు