కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ఓ వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరితోపాటు ఓ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులంతా విజయవాడలో అయ్యప్పనగర్‌కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: