రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనపై నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మంత్రి నివాసం మెయిన్ గేటు వద్ద నిల్చున్న నాగేశ్వరరావు హఠాత్తుగా ముందుకు పరిగెత్తుతూ వెళుతున్నట్లు దృశ్యాల్లో కనపడుతోంది. మంత్రిపై దాడి జరిగిన తర్వాత ఆయన ఇంటి వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మచిలీపట్నంలోని మంత్రి నివాసం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పేర్ని నానికి కల్పిస్తున్న భద్రతకు అదనంగా ఓ ఎస్సై, ఏఎస్సై , ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించారు. దాడి ఘటనలో నిందితుడు నాగేశ్వరరావును కస్టడీ కోరుతూ... జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: