Car collided with a parked truck at nidamanuru: కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి చేపట్టారు.
ఇదీ చదవండి.. 'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి- ఆ దేశంలో తొలి కేసు నమోదు