ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధురాలి ఆత్మహత్య

ఆర్థిక బాధలు... కాలిన గాయాన్ని ఆ వృద్ధురాలు తట్టుకోలేక పోయింది. 80 ఏళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకొని, మానసిక పరిపక్వత లేని కుమారుడిని ఒంటరిని చేసింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.

old women committed suicide
వృద్ధురాలు ఆత్మహత్య
author img

By

Published : Jun 23, 2020, 10:08 AM IST

Updated : Jun 23, 2020, 10:18 AM IST

విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్ద ఉన్న కాలువలోకి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. న్యూ రాజరాజేశ్వరి పేట వాటర్ ట్యాంక్ సమీపంలో ఉంటున్న బూర్ల అమ్ములమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థరించారు.

అమ్ములమ్మ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆగిరిపల్లిలో ఉంటున్నాడు. చిన్నకుమారుడుకి మానసిక ఎదుగదల లేకపోవటంతో ఆమె వద్దే ఉంటున్నాడు. ఇటీవలే వేడి టీ కాలి మీద పడటంతో తీవ్ర గాయమయ్యింది. పైగా అప్పులు కూడా ఎక్కువ కావటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బుడమేరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండి: చల్లపల్లిలో అర్హులందరుకీ నివేశనా స్థలాలు ఇవ్వాలి

Last Updated : Jun 23, 2020, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.