రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 48,235 మంది నమూనాలు పరీక్షించగా 693 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా 927 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,310 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ బారిన పడి.. కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,86,60,811 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి