ETV Bharat / state

నగర, పురపాలిక ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్‌

రాష్ట్రంలో బుధవారం జరిగిన 12 నగరపాలక, 71 పురపాలిక, నగరపంచాయతీల ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 62.28 శాతం నమోదైనట్లు తొలుత అంచనాకు వచ్చిన ఎస్​ఈసీ గురువారం తుది వివరాలు వెల్లడించింది.

నగర, పురపాలిక ఎన్నికల్లో  64.34 శాతం పోలింగ్‌
నగర, పురపాలిక ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్‌
author img

By

Published : Mar 12, 2021, 5:49 AM IST

Updated : Mar 12, 2021, 5:55 AM IST

రాష్ట్రంలో 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 62.28% నమోదైనట్లు తొలుత అంచనాకు వచ్చిన ఎస్‌ఈసీ.. గురువారం తుది వివరాలను వెల్లడించింది. 13 జిల్లాల ఎన్నికల అధికారులు నిర్ధారించి పంపిన సమాచారాన్ని క్రోడీకరించాక.. 64.34 శాతం ఓటింగ్‌ జరిగినట్లు తేల్చింది. నగర పాలక సంస్థల్లో 60 శాతం, పురపాలక, నగర పంచాయతీల్లో 71.37 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరాల్లో ఒంగోలు (74.84%), మచిలీపట్నం (72.53%), చిత్తూరు (66.91%) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా కర్నూలులో 49.73 శాతం ఓటేశారు.

మెుత్తం ఓట్లపై గందరగోళం!

ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని మొత్తం ఓట్ల సంఖ్యలో గందరగోళం నెలకొంది. మొదట ఇచ్చిన సంఖ్యకు, పోలింగ్‌ తర్వాత సంఖ్యకు సుమారు 40వేల ఓట్లు తేడా వచ్చాయి. ఫలితంగా పోలింగ్‌ శాతం మారింది. చివరకు 63.02% పోలింగ్‌ జరిగిందని అధికారులు లెక్కలు తేల్చారు. నగర పాలక సంస్థ డివిజన్ల వారీగా ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 7,81,883. ఈ లెక్కతోనే గంట గంటకూ పోలింగ్‌ శాతం లెక్కించారు. కానీ పోలింగ్‌ ముగిశాక మొత్తం ఓటర్లు 7,41,747 అంటున్నారు. మిగిలిన 40,136 మంది ఏమైనట్లు..? చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించామన్నది అనధికార సమాధానం.

ఏం జరిగిందంటే..
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. అలాగే విజయవాడలోనూ 2020 జనవరి నాటికి సిద్ధం చేశారు. వీటిలో ఏఎస్‌డీ (అబ్జెంట్‌, షిఫ్ట్‌, డెత్‌) ఓట్లను మార్చలేదు. చిరునామాలో లేనివారి పేర్లు, వేరే చిరునామాకు మారినవారు, చనిపోయినవారి పేర్లు తొలగించకుండానే జాబితా ప్రకటించారు. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో దీన్ని సరిదిద్దారు. విజయవాడలో మాత్రం విస్మరించారు. దీంతో వీఎంసీ కమిషనరు రాత్రికి రాత్రి వాటిని కుదించేశారు. దీంతో 40వేల ఓట్లు జాబితా నుంచి మాయమయ్యాయి.
* విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలను అన్ని పక్షాలూ ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పలు లోపాలు కనిపించాయి. ఒక డివిజన్‌లోని ఓట్లు మరో డివిజన్‌కు వెళ్లాయి. ఇంటి డిజిటల్‌ నంబర్ల వల్ల ఇలా మారొచ్చని అధికారులు చెబుతున్నారు. అలా మారినప్పుడు ఆ డివిజన్‌ ఓటరుగానే పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి ఓట్లను తొలగించామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. ఎలా తొలగిస్తారంటే సమాధానం చెప్పేవారు లేరు.
బందరు నగరపాలకసంస్థ, మిగిలిన పురపాలక సంఘాల్లో పోలింగ్‌ ముగిసిన గంటలోపే కచ్చితమైన లెక్కలు నివేదించారు. వీఎంసీ పరిధిలో గురువారం ఉదయానికీ మార్పులు జరిగాయి. అధికారులను అడిగితే శివరాత్రి సెలవులో ఉన్నారని చెబుతున్నారు.

ఇవీ చదవండి

గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్‌

Last Updated : Mar 12, 2021, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.