విజయవాడలో కార్తీక మాసం పురస్కరించుకుని లక్ష దీపాల కార్యక్రమం నిర్వహించారు. శత సహస్ర దీపార్చన సేవా మండలి ఆధ్వర్యంలో నగరంలోని అజిత్‌సింగ్‌నగర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం ప్రాంగణంలో ఈ వేడుక జరిగింది. 300 అడుగుల శివలింగ ఆకృతిలో లక్ష దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నపిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి