కృష్ణా జిల్లా గన్నవరం రైతు బజార్లో 3 లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. ఓబులనేని రాజేంద్రప్రసాద్ అనే రైతు బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసి.. స్కూటీ డిక్కీలో పెట్టి రైతుబజార్లో కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి 3లక్షల రూపాయలు మాయమయ్యాయి. రాజేంద్రప్రసాద్ గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ.. బంగారు, వెండి వస్తువులు అహహరణ