కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఏ-కాలనీ క్వార్టర్స్‌లోని ఓ బ్యాంకకు చెందిన ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన వారికి 20 వేల నగదు దొరికింది. వీరి కంటే ముందు ఏటీఎంలోకి వెళ్లిన వారు నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించి.. రాకపోయేసరికి వెళ్లిపోయారు. తర్వాత 20 వేలు బయటకు వచ్చాయి. కాసేపటికి ఏటీఎంలోకి వెళ్లిన వ్యక్తి ఆ నగదును చూసి... విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు... బాధితులకు అందజేసేందుకు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: