కృష్ణా జిల్లా కంచికచర్ల వసంత కాలనీలో భారీ చోరీ జరిగింది. జాన్ బాషా అనే వ్యక్తి పొలం కొనడానికి, బ్యాంకు నుంచి 10లక్షలు డ్రా చేసి తన ఇంట్లోని బీరువాలో పెట్టాడు. రాత్రి మేడ మీద పడుకున్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న పది లక్షలు ఎత్తుకెళ్లారు. వేసిన బీరువా వేసినట్టే ఉంది.. కాని దొంగతనం జరిగింది.. సాయంత్రం డబ్బు కోసం చూసిన బాషా నగదు లేకపోయేసరికి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడపలోనూ ఇలాగే జరిగింది.. వెంకటేశ్వర బూక్డిపో తలుపులు పగలకొట్టి 60 వేల సొమ్ము దోచేశారు. ఇలాంటి భారీ చోరీలు తరచూ జరుగుతూనే ఉన్నాయి...కష్టపడ్డ సొమ్మును ఊరికే వదిలేయకండి.. మాటువేసి దోచే దొంగలు మన చుట్టూనే ఉన్నారు .. జర చూసుకోండి మరీ...!
ఇదీ చూడండి:దొంగలు అరెస్ట్... పది వాహనాలు స్వాధీనం