ETV Bharat / state

'సీఎం జగన్‌కు కోడి పందేలు, జూదంపై ఉన్న శ్రద్ధ.. ధాన్యం కొనుగోళ్లపై లేదు' - టీడీపీ తాజా వార్తలు

Nimmala Ramanaidu sensational comments on CM Jagan: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్టి వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కోడి పందేలు, జూదం, గుండాటాలపై ఉన్న శ్రద్ధ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిపై లేదని పలు విమర్శనాస్త్రాలు సంధించారు.

Ramanaidu
టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు
author img

By

Published : Jan 19, 2023, 2:00 PM IST

Nimmala Ramanaidu sensational comments on CM Jagan: రాష్ట్ర ప్రభుత్వానికి కోడి పందేలు, జూదం, గుండాటాలపై ఉన్న శ్రద్ధ, రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్టి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పలు విమర్శనాస్త్రాలు సంధించారు. 2020-21లో 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని, 2022-23లో 37 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేయడం రైతుల్ని నట్టేటముంచడమేనని వ్యాఖ్యానించారు.

అనంతరం రైతుల వద్ద ధాన్యం నిల్వలుంటే, ప్రభుత్వం అర్థంతరంగా కొనుగోళ్లను నిలిపేయడమేంటని నిలదీశారు. యంత్రాల ద్వారా కోసిన ధాన్యంలో కచ్చితంగా తేమ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తేమశాతం పేరుతో జగన్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయంపైనే విరక్తి పుట్టించేలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలకు న్యాయం చేయకుంటే.. ‘రైతుకోసం-తెలుగుదేశం’ అనే కార్యక్రమం చేపట్టి.. జగన్ రెడ్డికి దిమ్మతిరిగేలా చేస్తామని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

మరోపక్క గత మూడేళ్లతో పోలిస్తే.. ఈ ఏడాది అధిక పరిమాణంలో ధాన్యం కొన్నామంటూ తాజాగా పౌర సరఫరాల సంస్థ కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లను నిలిపివేయడంపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం నిల్వలున్నా ప్రభుత్వంపై కొనకపోవడంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రైతులు ఈ నెల 13న కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నిమ్మల రామానాయుడు ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.