Subramanya Swamy Sashti Celebrations: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయంలో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోవటంతో, స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు - త్రికోటేశ్వరస్వామికి మొక్కులు
Sashti Celebrations in Konaseema District: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముమ్మిడివరం, మురమళ్ల, గుత్తెనదీవి, గచ్చకాయ పొర నాగపట్నం, తాళ్లరేవు గ్రామాల్లో షష్టి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాలకి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్వామివారిని దర్శించుకున్నారు. అమలాపురం తో సహా కోనసీమ వ్యాప్తంగా సుబ్రమణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి
Sashti Celebrations in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తణుకు పట్టణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. సుమారు 7 దశాబ్దాల క్రితం పామర్తి వంశీకులు స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామి వారిని దర్శించుకుంటే మంచి దృష్టిని ప్రసాదించి, అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తారని భక్తులు నమ్ముతారు.
సాయినామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
Sashti Celebrations in East Godavari: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రసిద్ధ గోలింగేశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి తీర్థపు బిందె సేవతో షష్టి వేడుకలు ప్రారంభించారు. గోదావరి నదీ కాలువలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నాగుల పుట్టపై ఉంచిన చీర ధరించి అక్కడే నిద్రచేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉండ్రాజవరంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
"ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా 200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశాము". - పోలీసులు
తూర్పుగోదావరి ఉండ్రాజవరంలో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే రోజుల్లో ఉరగరాజు అనే సామంత రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. తన ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రతిరూపమైన పాములకు పూజలు చేసేవాడు. ప్రస్తుతం ఆలయం ఉన్నచోట ఉండే పుట్టలలోని పాములకు పూజ చేసేవాడని, అక్కడే ఆలయం నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ ఉరగరాజు పేరు మీద గానే గ్రామానికి ఉరగరాజపురం అని పేరు వచ్చిందని అదే కాలక్రమేణ ఉండ్రాజవరంగా మారిందని స్థానికులు చెబుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.