Reunion of Old Students : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆట పాటలు, చిల్లర పనులు కష్టం సుఖం ఇలా ఏదైనా కాని అన్నింట్లో మన వెన్నంటే ఉండీ సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే. అందరి కన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది పదవ తరగతి వరకు చదువుకున్న దోస్తులు.. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికి మరచిపోనివి మరుపు రానివి.. పదో తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్లీ 34 ఏళ్ల తర్వాత అందరు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.. అలానే ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు.. చేసే అల్లరి.. స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు.. వారితో కలిసి ఆడిన ఆటలు.. చిన్న చిన్న గ్యాంగ్‌లు.. అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ముప్పై ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమురు మండలం నర్సిపూడిలో పూర్వ విద్యార్థులు.
ఆత్మీయ కలయిక జడ్పీపీ హై స్కూల్ నర్సిపూడిలో ఘనంగా నిర్వహించారు. పదో తరగతి చదువుకున్న వారు అందరూ ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా ఇలా ఒక్కటయ్యారు. పూర్వ విద్యార్థులు కలవడం అంటే 5 ఏళ్లకో , 10 ఏళ్లకో కలవడం చూసాం. కానీ వీరు 30 ఏళ్ల తరువాత కలిశారు. వీరంతా అందరూ ఒక చోట చేరారు. ఆత్మీయతలు అనురాగాలు పంచుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. సందడిగా గడిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991 - 1992 సంవత్సరం లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల విరామం తర్వాత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో పిల్లలు పెద్దలు డాన్సులు చేస్తూ ఉర్రుతలు ఊగించారు. ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన వారందరికీ కోనసీమ రుచులతో విందు ఏర్పాటు చేసి మైమర్పించారు.
ముప్పై ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. వాట్సప్ వేదికగా గత కొద్ది రోజుల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇవీ చదవండి: