School Students Hospitalized from Food Poison: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలోని జ్యోతీరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య 11కు చేరుకుంది. మంగళవారం రోజున ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విధితమే, అయితే వారిని అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మరో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆ సంఖ్య 11కు చేరుకుంది.
అస్వస్థకు గురికావడానికి కారణాలు: అయితే విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడానికి కారణాలపై ఆరా తీసినప్పుడు, ఆదివారం రోజున విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు తీసుకువచ్చిన ఆహారం అనే ఆరోపణలున్నాయి. ఆదివారం విద్యార్థులను తల్లిద్రండులు హాస్టల్‌కు వచ్చిన సమయంలో, వారితో పాటు బయటి నుంచి తీసుకువచ్చిన బిర్యానీ పెట్టారని సమాచారం.
నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత
విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకువచ్చిన బిర్యానిని కొంత నిల్వ ఉంచుకుని మరుసటి రోజు తిన్నారని విద్యార్థులు వైద్యులకు తెలిపారు. అలా నిల్వ ఉంచిన బిర్యాని మరుసటి రోజు తినడమే ఫుడ్ పాయిజన్‌కు కారణమై ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులతో మంత్రి చెల్లుబోయిన : అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పలకరించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో వైద్యులు విద్యార్థుల ఆరోగ్య స్థితిని మంత్రికి వివరించారు. విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని వివరించారు. అనంతరం మంత్రి సమనసలోని గురుకుల పాఠశాలను సందర్శించి, అక్కడి వంటకాలను పరిశీలించారు.
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. విద్యార్థులు బయటి నుంచి తీసుకువచ్చిన బిర్యాని తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై విచారణ జరపాలని మంత్రి పోలీసులకు సూచించారు. పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
విద్యార్థుల హెల్త్ కండీషన్‌పై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరాలు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను తిరిగి పంపించినట్లు అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్రావు వెల్లడించారు. 11 మందిలో ఓ విద్యార్థికి మాత్రం ఇతర అనారోగ్య కారణాల వల్ల తిరిగి పంపిచలేదని అతనికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నేరేడుపండ్లు తిని బాలుడు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం.. అసలేమైంది..?