Electric shock: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గొంతుకుర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విద్యుత్ ఘాతంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ అమలాపురం ఆసుపత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండదని డాక్టర్లు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల ఆవరణంలో... సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ భవనానికి స్లాబ్ వేసేందుకు అవసరమైన ఇనుమను పాఠశాల ప్రాంగణంలో కటింగ్ మిషన్ సాయంతో ముక్కలు చేస్తున్నారు. ఈ సమయంలో కటింగ్ మిషన్ తో పనిముగిసాక, విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోవడంతో.. ఆ యంత్రం తో ఉన్న ఇనపు చువ్వలకు విద్యుత్ ప్రవాహం జరుగుతోంది. ఈ విషయం తెలియక, పాఠశాల ప్రాంగాణలో ఆటలాడుకుంటున్న చిన్నారులు.. ఆ ఇనపరాడ్లను తాకడంతో, ఐదుగురు తీవ్ర విద్యుదఘాతానికి గురైయ్యారు. హుటాహుటిని గాయపడిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ.. మూడో తరగతి ఎడ్ల నవీన్ ఆస్పత్రిలో పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బిడ్డ లేని బతుకు ఎందుకంటూ బోరున విలపించారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ వారిని ఎంతగా సముదాయించినా వినలేదు. బాలుడు తండ్రి రోడ్డుపై పడి దొర్లి ఏడుస్తూ ఎమ్మెల్యే కాళ్లపై పడడం అందరినీ కంటతడి పెట్టించింది. మంచిగా చదివి ఆదరిస్తాడు అనుకుంటే, చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాండంటూ తల్లిదండ్రులు రోదించారు. మరో 20 నిమిషాలైతే పాఠశాల విద్యార్థులంతా బయటికి వచ్చేవారని.. అపుడు మరింత ప్రాణనష్టం వాటిల్లేదని స్థానికులు వాపోయారు.
ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
ఈ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తాన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని..బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: