CM's Visit to Flood Areas గడిచిన నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజల వారం రోజులు పాటు వరద నీటిలో అవస్థలు పడుతూనే కుటుంబాలతో ఉన్నారు. వరదల కారణంగా పాడైన రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, విద్యుత్ స్తంభాలు గానీ ఈ నాలుగేళ్లలో అధికారులు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కానీ, ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పన శరవేగంగా జరుగుతోంది. బురదమయమైన లంక భూమిలోకి వెళ్లే కచ్చా రోడ్లు గ్రావెల్ రోడ్లుగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన సీసీ రోడ్లకు ఇరువైపులా వెడల్పు పనులు చకచకా జరిగిపోతున్నాయి. పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, కూనలంక, లంక ఆఫ్ ఠాణేల్లంక గ్రామాలను వారం రోజుల కిందట చూసినవాళ్లు ఇప్పుడు చూస్తే... వారం రోజులు వరద నీటిలో ఉన్న గ్రామాలేనా అని ఆశ్చర్యకపోక తప్పదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. (CM Jaganmohan Reddy) వరద బాధితులను స్వయంగా కలుసుకునే ప్రాంతాలు, కోతకు గురవుతున్న ఏటిగట్టు పరిశీలించే ప్రాంతాలకు ఇతరులు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Flood Victims ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Kona Seema District) ముమ్మిడివరం, ఐ పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో గల గౌతమీ గోదావరి.. వృద్ధ గౌతమి గోదావరి నదీపాయల వరదల కారణంగా ముంపు బారినపడిన గ్రామాలు, పంట పొలాలు, నదీ కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కి స్వాగతం పలికేందుకు లంక గ్రామాలు ముస్తాబయ్యాయి. గురజాపులంకలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మంగళవారం ఉదయం 10:40గంటలకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. హెలిపాడ్ సమీపంలోనే ఉన్న వరద ప్రవాహానికి కోతకు గురైన లంక భూములు, కుళ్లిపోయిన పంటపొలాలను సీఎం పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు తగిన ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కూనలంక, లంక ఆఫ్ ఠాణేల్లంక గ్రామాలకు చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు.
Heavy Police Presence ముఖ్యమంత్రి రాక పురస్కరించుకుని లంక గ్రామాల్లో నూతనంగా విద్యుత్ స్తంభాలు వేసి ఎల్ఈడీ దీపాలు పెట్టారు. జరుగుతున్న పనులను కలెక్టర్ హిమాన్స్ శుక్లా, అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు కోసం సిద్ధంగా ఉన్నారు. మారుమూల లంక గ్రామంలో మొదటిసారి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేస్తుండటంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం నుంచి లంక గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
వరద ప్రభావిత ప్రాంతాలైన అయినవిల్లి లంక, కొండుకుదురు లంక నదీ కోతకు గురవుతున్న లంక గ్రామాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనుండగా.. ఏర్పాట్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ శ్రీధర్ పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక కోసం అధికారులు ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తున్నారు. అయినవిల్లి మండల పరిధిలోని కొండకుదురులంక పొట్టిలంక ప్రాంతాల్లోని నది కోతకు గురైన ప్రదేశాలను సీఎం పరిశీలించనున్నారు. గౌతమి నదీపాయ కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించిన అనంతరం స్థానికంగా ఉన్న తత్తరమూడి వారి పేటలో బాధితులతో సీఎం మాట్లాడుతారని అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Bugga Vanka Bridge: బుగ్గవంక రక్షణ గోడపై బ్రిడ్జి కట్టేదెప్పుడు..? పట్టించుకునేవారే కరువాయే..!