ap cabinet meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై కెేబినెట్ చర్చించనుంది.
2014 జూన్ 2 తేదీనాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై చర్చించి ఆమోదం తెలియ చేయనుంది. సీపీఎస్ స్థానే తెచ్చిన జీపీఎస్ లో మార్పు చేర్పులు చేస్తూ కేబినెట్ లో ప్రతిపాదనలు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. గురుకులాలు, విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ ప్రతిపాదనలపై నా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
అటు మచిలీపట్నం పోర్టు మొదటి దశకు సంబధించిన నిధులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. చిత్తూరు డెయిరీనీ అముల్‌కు అప్పజెప్పే అంశం పై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు పశు సంవర్ధక శాఖ చిత్తూరు డెయిరీని అముల్‌కు అప్పగించే అంశంపై కేబినెట్లో ప్రతిపాదన చేసింది. ఏడాదికి సుమారు కోటి రూపాయల లీజు ప్రతిపాదనతో అముల్‌కు చిత్తూరు డెయిరీ అప్పగించేందుకు ప్రతిపాదన చేశారు. 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
అవినీతికి దూరంగా ఉండండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..
రాపాక వరప్రసాదరావు కుమారుడి పెళ్లి వేడుకలకు హాజరు కానున్న సీఎం జగన్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండలో పర్యటించనున్నారు. రాపాక వరప్రసాదరావు కుమారుడు వెంకట్రామ్ పరిణయ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి అధికార యంత్రంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మలికిపురం సత్యజ్యోతి థియోటర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు 2.55 గంటలకు చేరుకోనున్నారు. 3.05 గంటల వరకు సీఎం జగన్ స్థానిక ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తారు. అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా కత్తిమండలోని రాపాక నివాసానికి చేరుకుని పెళ్లి వేడుకలో పాల్గొనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
వధువరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి 3.40గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని స్థానికంగా మంత్రులు, పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులను కలుసుకోనున్నారు. తిరిగి 4.05 గంటలకు తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ ధ్యాన్చంద్ర, ఎస్పీ శ్రీధర్, ఆర్డీవోలు వసంతరాయుడు, ముక్కంటి, జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఇనుపరాడ్లు పాతి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్టీ అభిమానులు నాయకులు సీఎంకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Cabinet meeting ఈనెల 29న మంత్రివర్గ సమావేశం, ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఆదేశం