Funeral of Varupula Raja : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ వరుపుల రాజా అంత్యక్రియలను అధికారిక లాంఛనాతో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించినట్లు మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వరుపుల భౌతిక కాయానికి వైసీపీ నెేతలు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబుతో కలిసి ఆయన రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. రాజా గతంలో తామతో కలిసి వైసీపీలో పనిచేశారని వారు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆయనతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. రాజా హఠాన్మరణం తమను తీవ్ర ద్రిగ్భాతి గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. రాజా కుటుంబ సభ్యులకు, అభిమానులకు పార్టీ శ్రేణులకు.. మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాజా ఆత్మకు శాంతి కలగాలని కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత పరామర్శ : వరుపుల రాజా హఠాన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్తిపాడులోని వరుపుల రాజా నివాసానికి వచ్చిన చంద్రబాబు.. భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాజా మరణం టీడీపీకి తీరని లోటని అన్నారు. రాజా కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కన్నబాబు సంతాపం : వరుపుల రాజా మనల్ని విడిచి వెళ్లిపోవటం చాలా బాధకరమని ఎమ్మెల్యే కన్నబాబు విచారం వ్యక్తం చేశారు. వరుపుల మరణ వార్త వినగాగనే దిగ్భ్రాంతికి లోనయినట్లు తెలిపారు. ఆయన ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసిమెలసి ఉండేవారని వివరించారు. అందరితో స్నేహపూరితంగా ఉండే వ్యక్తి ఈ రోజు అందరి మధ్య లేకపోవటం దురదృష్టకరమని అన్నారు.
వరుపుల రాజా మరణం : ప్రత్తిపాడు నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జ్‌గా భాద్యతలు నిర్వహిస్తున్న వరుపుల రాజా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన నివాసంలో గుండెపోటు రావటంతో వెంటనే ప్రత్తిపాడు నుంచి కాకినాడ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన రాజా ఆసుపత్రికి చేరుకోగానే అకస్మాత్తుగా కుప్పకులారు. వైద్యులు వేగంగా వైద్యం అందించినప్పటికి ప్రాణాలు దక్కలేదు.
ఇవీ చదవండి :