ETV Bharat / state

కాకినాడ హైవే పై లారీ, కంటైనర్ ఢీకొని.. ఇద్దరు డ్రైవర్లు సహా క్లీనర్ సజీవదహనం - లారీ కంటైనర్ ప్రమాదం

Road Accident in Prathipadu: ధర్మవరం జాతీయ రహదారిపై అర్థరాత్రి లారీ, కంటైనర్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్​తో సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.

Road accident on Dharmavaram National Highway
ధర్మవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 2, 2022, 6:50 AM IST

Updated : Dec 2, 2022, 8:40 AM IST

Road Accident in Prathipadu: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం జాతీయ రహదారిపై అర్థరాత్రి లారీ, కంటైనర్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్​తో సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. కత్తిపూడి వైపుగా ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి డివైడర్ మీదగా ఆవలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్​ను అతి వేగంగా డీ కొనడంతో.. మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ధర్మవరం జాతీయ రహదారిపై లారీ, కంటైనర్ ఢీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 2, 2022, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.