కాకినాడ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గత 25 రోజులుగా ప్రత్తిపాడులో పాగా వేసిన పులి.. ఎప్పటికప్పుడు మకాం మార్చుతూ గ్రామాల్లో స్వేచ్ఛగా తిరుగుతోంది. మంగళవారం శంఖవరం మండలం వైపు వెళ్లిన పులి.. తిరిగి ప్రత్తిపాడు వైపు మళ్లింది. మార్గమధ్యలో శరభవరం-ఒమ్మంగి సరిహద్దుల్లో పశువులపై దాడి చేసింది. అయితే.. పులి భారీనుంచి నుంచి గాయాలతో ఆవు, దూడలు తప్పించుకున్నాయి.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఉధండ జగన్నాధపురం పరిసరాల్లో పులి అడుగులు కనిపించడంతో బోనులు ఏర్పాటు చేశారు. పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పోతులూరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 25 రోజులుగా ప్రజలను హడలెత్తిస్తున్న పెద్ద పులి.. తోటపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్తుందా.. లేదంటే గ్రామాల్లోనే తిరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: