ETV Bharat / state

జగన్ చేసే అవినీతిని ప్రశ్నిస్తే.. ఎవరిమీదైనా తప్పుడు కేసులు పెడతారా..!: టీడీపీ

Bonda Umamaheswara Rao: మార్గదర్శిని సీఐడీ ద్వారా వేధించే హక్కు జగన్​కి ఎవరిచ్చారని టీడీపీ నేత ఉమామహేశ్వరరావు నిలదీశారు. కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్​కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తాడని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ప్రశ్నించారు. సీఎంకు ధైర్యం ఉంటే షర్మిల, సునీత నివాసాల్లో కూడా జగనన్నే మా నమ్మకం స్టిక్కర్ లు అంటించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందంటూ వివిధ అంశాలపై టీడీపీ నేతలు స్పందించారు.

Bonda Umamaheswara
ఉమామహేశ్వరరావు
author img

By

Published : Apr 11, 2023, 4:52 PM IST

బోండా ఉమామహేశ్వరరావు

TDP on Jagan policies: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం రాజ్యాంగ వ్యవస్థల్ని వినియోగిస్తోందని మండిపడ్డారు. దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులపై సొంత కక్ష సాధించేందుకు సీఐడీని వాడటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దశాబ్దాల నుంచి ప్రజల్లో మార్గదర్శిపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయటానికి సీఐడీని ప్రయోగించటం దుర్మార్గమని బోండా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగుజాతి ఐకాన్​గా ప్రపంచం గుర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఓ అంధుడిలా నటిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ హత్య కేసులోనే నమ్మిన వారిని నట్టేట ముంచిన రకం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.

ప్రశ్నిస్తే ఎవరిమీదైనా తప్పుడు కేసులు: మార్గదర్శిని సీఐడీ ద్వారా వేధించే హక్కు జగన్​కి ఎవరిచ్చారని ఉమామహేశ్వరరావు నిలదీశారు. అవినీతి ని వెలికితీసి, ప్రశ్నిస్తే ఎవరిమీదైనా తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి ఏపీ వైపు చూడాలంటేనే ఏ పారిశ్రామికవేతైనా భయపడేలా చేశారని ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో అగ్రీగోల్డ్ సహా వేల కోట్ల రూపాయలు అవినీతి వివిధ సంస్థల ద్వారా జరిగితే ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని ఉమా ఆక్షేపించారు. ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శి మీద మాత్రం అక్రమ కేసులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే గొంతుకల్ని ఇలా విధించాలని చూస్తే వెంట్రుక కూడా జగన్మోహన్ రెడ్డి పీకలేరని స్పష్టం చేశారు. మహా మహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని జగన్ గ్రహించాలని ఉమా హితవు పలికారు. రాబోయో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోండా ఉమా హెచ్చరించారు.

కోడికత్తి శ్రీనివాస్: కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్ కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తాడని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ప్రశ్నించారు. కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటూ విచారణలో జాప్యానికి జగనే కారణమవుతున్నాడని విమర్శించారు. 4 ఏళ్లనుంచి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్ మగ్గిపోతున్నా, అతని తల్లిదండ్రులు కన్నీటితో విలపిస్తున్నా జగన్ లో చలనంలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ తల్లిదండ్రుల ముఖంచూసి, వారికి ధైర్యంచెప్పడానికి కూడా జగన్ కు మనసురాలేదని దుయ్యబట్టారు. దళిత బిడ్డల్ని తనస్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్న జగన్ వారికి మేనమామ అవుతాడా అని ఎద్దేవా చేశారు.

జగనన్నే మా నమ్మకం స్టిక్కర్: సీఎంకు ధైర్యం ఉంటే షర్మిల, సునీత నివాసాల్లో కూడా జగనన్నే మా నమ్మకం స్టిక్కర్ లు అంటించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సూచించారు. జగన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. మహిళల మానప్రాణాలతో ఆడుకుంటూ, వారి జీవితాలు నాశనంచేస్తున్నందుకు నమ్మాలా అని నిలదీశారు. పార్టీ రంగుతో ఉన్న స్టిక్కర్ లను అధికారులు ఎలా అంటిస్తున్నారన్నారు. ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ 1997ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజల అనుమతి లేకుండా వారిఇళ్లపై ప్రకటనలు. బొమ్మలు అంటించడం చేయకూడదని తెలియదా అని ప్రశ్నించారు. కల్యాణి అరెస్ట్ లో హద్దులుమీరి ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.