ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించిన తీరు బట్టబయలైంది. ప్రజలకు చేరాల్సిన ఓరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లేఖలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు బట్వాడా చేయకుండా.. తొర్రగుంటపాలెం ఆర్టీవో కార్యాలయం వెనుక ముళ్లతుప్పల్లో పడేశారు.
పడేసిన వాటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లు, బుక్ స్టాళ్ల నుంచి తెప్పించుకునే స్టడీ మెటీరియళ్లు, సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ రిజిస్టర్ పోస్ట్‌కు సంబంధించినవిగా తెలిసింది. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి