ETV Bharat / state

Police Restrictions at Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆంక్షలు.. మీడియాతో మాట్లాడవద్దని చంద్రబాబుకు హైకోర్టు షరతులు - చంద్రబాబు బెయిల్ వార్తలు

Police Restrictions at Rajahmundry Central Jail: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. పోలీసులు వ్యవహార శైలిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తరువాత ఆంక్షలు విధించాలని కోరుతూ సీఐడీ అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ర్యాలీలు చేయొద్దని, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీడియాతో మాట్లాడ వద్దని చంద్రబాబు నాయుడును హైకోర్టు ఆదేశించింది.

Police_Restrictions_at_Rajahmundry_Central_Jail

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 9:20 PM IST

Police Restrictions at Rajahmundry Central Jail : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాల దృష్ట్యా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ (Chandrababu Interim Bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి విడుదలైన తమ అధినేతను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు జైలు వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు. జైలుకు 3 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టడం దారుణమని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కూడా ఆంక్షలు ఎందుకని వారు ప్రశ్నించారు. జైలు వద్దకు రాకుండా పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదని అన్నారు.

TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'

TDP Leader Atchannaidu Fires on Police Behavior : రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఆంక్షలు విధించడంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఎప్పుడూలేని ఆంక్షలు విధిస్తున్నారని, చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును 52 రోజులు జైలులో పెట్టారని, ఇప్పుడు బెయిల్‌ వచ్చి, చంద్రబాబు బయటకు వస్తున్నారని తెలిసిన తర్వాత రాజకీయలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి తమ నాయకుడిని చూసుకుందామని వస్తే, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టారని, సీనియర్‌ నేతలైన తనపైనే కఠినమైన ఆంక్షలు పెడుతున్నారని, ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలని చూస్తే ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు.

Chandrababu Released from Rajahmundry Central Jail: రాజమండ్రి తరలివచ్చిన అభిమాన జనతరంగం.. చంద్రబాబును చూసి ఆనందపారవశ్యం

Huge Crowd at Rajamahendravaram Central Jail : చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తరుణంలో రాజమండ్రి జైలు వద్ద ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబును చూసేందుకు ఏపీతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకుని కార్యకర్తలు జైలు వద్దకు ఉవ్వెత్తున దూసుకెళ్లారు. "జై చంద్రబాబు" అంటూ జైలు ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు.

AP High Court Imposed Conditions for Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తరువాత ఆంక్షలు విధించాలని కోరుతూ సీఐడీ అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రసంగాలు చేయకూడదని, రాజకీయ ర్యాలీలు, మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు చేయొద్దని, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని చంద్రబాబు నాయుడును హైకోర్టు (High Court Conditions for Chandrababu) ఆదేశించింది. సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Reaction Other Party Leaders on Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ మంజూరుపై పవన్, పురందేశ్వరి హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.