Nara Lokesh Yuvagalam Padayatra on day 213: వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయామని శెట్టి బలిజ సామాజిక వర్గీయులు లోకేశ్ వద్ద ఆవేదన వెళ్లగక్కారు. జగన్ హయాంలో బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యంగా మారాయని వాపోయారు. యువగళం పాదయాత్ర 213వ రోజు సందర్భంగా లోకేశ్ కాకినాడ జిల్లా కోరంగిలో శెట్టి బలిజలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను విన్న లోకేశ్.. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఉత్సాహంగా సాగుతున్న ‘యువగళం’ పాదయాత్ర - భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రెండు రోజులపాటు కొనసాగిన యువగళం పాదయాత్ర.. బుధవారం రాత్రి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్దకు చేరుకుంది.. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో గురువారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.. సుంకరపాలెంలో బస చేసిన ప్రాంతం నుండి బయలుదేరిన లోకేశ్ స్థానిక రవి డిగ్రీ కాలేజీ విద్యార్థినితో ముచ్చటించారు.. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. వారితో సెల్ఫీలు దిగారు.
మల్లవరం సెంటర్లో మహిళలతో సమావేశమై బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల వివరాలు వివరించారు.. లోకేశ్ వెంట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు.. యువజన సంఘం అధ్యక్షుడు ధూళిపూడి బాబి.. మాజీ శాసనసభ్యులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.. లోకేశ్‌కు దారి పొడవునా మహిళలు, యువత, విద్యార్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తాళ్లరేవులో భారీ గజమాల వేసి లోకేశ్‌పై అభిమానం చాటుకున్నారు.
పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్
ఇంజరం ప్రధాన రహదారిపై వంతెన శిథిలావస్థకు చేరి కూలినా.. నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదని లచ్చిపాలెం వాసులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. తూములు పూడిక తీయకపోవడంతో 13 గ్రామాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పల్లిపాలెం కాజులూరు రోడ్డు పాడై పోవడం రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నామని ప్రమాదాలు జరుగుతున్నా.. కనీస మరమ్మతులు చేయడం లేదని బాపనపల్లి గ్రామస్థులు తెలిపారు. చమురు సంస్థలు తమ ప్రాంతంలో ఉన్నా స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించడం లేదని తాళ్లరేవులో నిరుద్యోగ యువత లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా వైసీపీ ప్రభుత్వం మార్చింది: యువగళం పాదయాత్రలో లోకేశ్
తాళ్లరేవులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్ర ఫిష్ మార్ట్ చూపిస్తూ జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని అన్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కాకినాడ జిల్లాలోని కోరంగిలో లోకేశ్ శెట్టి బలిజ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం కోరంగి నుంచి పటవల, మట్లపాలెం, జి వేమవరం మీదుగా చొల్లంగిపేట వరకు పాదయాత్ర కొనసాగించారు. చొల్లంగిపేటలో లోకేశ్ రాత్రి బస చేయనున్నారు.