ETV Bharat / state

Ananthbabu remand extend: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ పొడిగింపు.. ఎప్పటివరకంటే..? - crime news

డ్రైవర్​ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్​ను కోర్టు మరోసారి పొడిగించింది. రాజమహేంద్రవరం కోర్టులో రిమాండ్​ ఖైదీగా ఉన్న అనంతబాబు కేసును విచారించిన కోర్టు.. ఈనెల 20 వరకు రిమాండ్​ పొడిగించింది. ఇదిలావుంటే రేపు అనంతబాబు బెయిల్​ పిటిషన్​ విచారణకు రానుంది.

1
ananthababu
author img

By

Published : Jun 6, 2022, 6:31 PM IST

MLC Ananthababu Remand extend: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్​ ఈనెల 20 వరకు రిమాండ్‌ పొడిగించారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనంతబాబు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. డ్రైవర్​ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడు. రేపు కోర్టులో అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రానుంది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ.. మే నెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్‌ ఫోన్‌ చేసి ...నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చారు.

సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.

సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు.. వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌(అనంతబాబు) అంగీకరించారని.. కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మే 23న ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన పోలీసులు.. జీజీహెచ్​లో వైద్య పరీక్షల అనంతరం.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా.. అర్ధరాత్రి ఒంటిగంట 15 నిమిషాల సమయంలో.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. హత్య ఘటనపై నిన్న డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగింటినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించామని.., ఇవాళ నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అహం దెబ్బతింది.. సంఘటన జరిగిన రోజు (19న) సుబ్రమణ్యం ఇంటి నుంచి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాడు. మిత్రులతో కలిసి మద్యం కొన్నాడు. శ్రీరామ్‌నగర్‌ ఏరియాలో ఓల్డ్‌ నవభారత్‌ స్కూలు ప్రాంగణంలో రాత్రి 10.15 వరకు మద్యం తాగారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేసరికి అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అటుగా వచ్చారు. సుబ్బును పిలిచించి వాహనంలోకి ఎక్కించుకున్నారు. మిగతా మిత్రులు వెళ్లిపోయారు. అదే వాహనంలో ముందుకు వెళ్లి, టిఫిన్‌ కట్టించుకుని.. 10.30 సమయంలో తిరిగి ఎమ్మెల్సీ నివాసం వైపు వెళ్లారు. నీ పెళ్లి సమయంలో ఇచ్చిన అప్పులో ఇంకా రూ.20 వేలు తిరిగివ్వలేదని అనంతబాబు అడగటంతో ఇచ్చేస్తానని సుబ్రమణ్యం చెప్పాడు. ‘నువ్వు ప్రవర్తన మార్చుకుని బాగుంటే నా దగ్గర పనిలో పెట్టుకోమని మీ అమ్మ అడుగుతోంది. నీ దగ్గర మద్యం వాసన వస్తుంది. నీలో మార్పు రాలేదు’ అని ఎమ్మెల్సీ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి వద్ద కారు ఆగి దిగాక.. నీ పద్ధతి బాగాలేదంటూ కొట్టడానికి అనంతబాబు ముందుకొస్తే.. తాగిన వ్యక్తిని ఎందుకన్నా కొడతావు అని సుబ్రమణ్యం ఎదురుతిరిగాడు. దీంతో అనంతబాబు అహం దెబ్బతిని మెడ పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆ వేగానికి సుబ్రమణ్యం అపార్ట్‌మెంట్‌ డ్రైనేజీ గట్టుపై పడటంతో తలకు గాయమైంది. నన్నే కొడతావా అని కోపంతో అతను మళ్లీ తిట్టడంతో అనంతబాబు రెండోసారి బలంగా కొట్టారు. దీంతో గ్రిల్స్‌కు తగిలి తలకు మళ్లీ గాయమైంది. అనంతబాబు అతణ్ని వాహనంలో ఎక్కించుకుని రెండు ఆసుపత్రులకు వెళ్లగా అవి మూసివేసి ఉన్నాయి. కారులో వస్తుండగా సుబ్రమణ్యానికి ఎక్కిళ్లు రావడంతో అనంతబాబు నీళ్లిచ్చారు. అవి తాగాక కొంతసేపటికి ఉలుకూపలుకూ లేకపోవడంతో పరీక్షించగా శ్వాస ఆగిపోయిందని గుర్తించారు. చనిపోయాడని భావించి, ఆ షాక్‌ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించారు.

ప్రమాదంగా చిత్రీకరించాలని భావించి.. సుబ్రమణ్యం తాగి, నాలుగైదుసార్లు ప్రమాదాలు చేశాడు. తాగిన ప్రతిసారీ యాక్సిడెంట్‌ చేస్తే.. ఆసుపత్రిలో చికిత్స చేయించి, కుటుంబానికి అప్పగించేవారు. దీన్ని కూడా అలాగే ప్రమాదంలా సృష్టిస్తే అనుమానం రాదని అనంతబాబు భావించారు. స్థానిక జి కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాలని చూశారు. అక్కడ ట్రాఫిక్‌ ఉండటంతో, డంపింగ్‌ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపడానికి చెట్టుకొమ్మతో తొడలు, చేతులు, భుజం, వీపుపైన కొట్టారు. తర్వాత అక్కడున్న తాడుతో మృతదేహాన్ని కట్టేసి వాహనంలో ఎక్కించారు. అక్కడ్నుంచి తిరిగివస్తూ 12.30 ప్రాంతంలో మృతుడి తల్లికి ఫోన్‌ చేసి.. సుబ్బుకు ప్రమాదం జరిగినట్లు నాకు సమాచారం వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నానని నమ్మబలికారు. కాసేపాగి మళ్లీ వారికి కాల్‌ చేసి, నేను మృతదేహాన్ని తీసుకువస్తున్నానని చెప్పారు. ఇంటికి రాగానే మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు అది ప్రమాదం కాదని అనుమానించారు. ఎమ్మెల్సీని నిలదీయడంతో ఆయన కారు వదిలి వేరే ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సర్పవరం ఠాణాలో కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ వివరించారు.

ఏయే సెక్షన్ల కింద కేసులు?: సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నంలో మృతదేహంపై గాయాలు చేయడం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద సెక్షన్లు మార్చి అనంతబాబును అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. అవసరమైతే మరోసారి పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. రూ.20 వేల కోసమే హత్య చేశాడా? వివాహేతర సంబంధాల నేపథ్యమా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్తవాల ప్రకారమే దర్యాప్తు ఉంటుందనీ.. ఇదే ఫైనల్‌ కాదని సమాధానమిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.